Telugu Global
Andhra Pradesh

ఏపీలో కూటమి సర్కారు కొత్త ట్రెండ్‌

పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

ఏపీలో కూటమి సర్కారు కొత్త ట్రెండ్‌
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్‌కు తెరతీసింది. ఎక్కడైనా పేరెంట్స్‌ - టీచర్స్‌ మీటింగ్‌ అంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొంటారు. శనివారం ఒకేరోజు ఏపీలో 45,094 ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్‌ స్కూళ్లలో మెగా పేరెంట్స్‌ - టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. బాపట్ల మున్సిపల్‌ స్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్నారు. కడప మున్సిపల్‌ స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం, మంత్రి బాపట్ల స్కూల్‌ ఆవరణను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సీఎం భోజనం చేయనున్నారు. కడప స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మిగతా స్కూళ్లలో నిర్వహించిన పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

First Published:  7 Dec 2024 1:10 PM IST
Next Story