దావోస్ చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలు సిద్ధం చేయండి
అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం
BY Raju Asari25 Jan 2025 9:47 AM IST
X
Raju Asari Updated On: 25 Jan 2025 1:33 PM IST
రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించడానికి దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సీఎంవో అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. మూడు రోజుల పాటు దావోస్‌లో ఆయా కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలు, ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు. త్వరలో దేశ, విదేశీ ప్రతినిధులు, సంస్థల సీఈవోలు రాష్ట్రంలో పర్యటించనున్నారని దానికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే ఆరు నెలల్లో వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
Next Story