హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
స్వామి వారిని దర్శించుకొని పులకించిన భక్తులు
BY Raju Asari9 Oct 2024 9:53 AM IST
X
Raju Asari Updated On: 9 Oct 2024 9:53 AM IST
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దీనిలోభాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు. కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదలతత్త్వం సిద్ధిస్తుందని నమ్మకం
భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వాహన సేవను చూశారు. భక్తి పారవశ్యంతో స్వామి వారిని దర్శించుకొని పులకించారు. ఆలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి గత వాహనసేవ ఉండనున్నది.
Next Story