Telugu Global
Andhra Pradesh

బీసీలను తొక్కేస్తున్నారు.. జోగి ఆవేదన

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పేమీ లేదని అన్నారు మాజీ మంత్రి జోగి. తమ కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామని తేల్చి చెప్పారు.

Jogi Ramesh
X

గౌడ కులం నుంచి తాను అంచెలంచలుగా ఎదిగానని, ఏపీలో బలహీన వర్గాలపై దాడి జరుగుతోందని, బీసీలను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. బీసీ అయినందు వల్లే తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఈరోజు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఆయన కొడుకు రాజీవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉరేసుకుంటా..!

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పేమీ లేదని అన్నారు మాజీ మంత్రి జోగి. తమ కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటామని తేల్చి చెప్పారు. తన కొడుకు విదేశాల్లో చదివాడని, ఉద్యోగం చేశాడని, ఉన్నత విద్యావంతుడని.. అలాంటి వ్యక్తిని అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. దీన్నిబలహీనవర్గాలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. "చంద్రబాబూ..! నీకూ కొడుకు ఉన్నాడు జాగ్రత్త.. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు. ఇకనైనా నీ వంకర బుద్ది మార్చుకో.." అని హెచ్చరించారు జోగి రమేష్.

గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇలానే బీసీలపై దాడి అంటూ టీడీపీ రాద్ధాంతం చేసింది. బీసీలయితే తప్పు చేసినా వదిలేయాలా..? తప్పు చేసినవాడు బీసీ అయితే ఏంటి..? ఓసీ అయితే ఏంటి..? అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సరిగ్గా ఇప్పుడు అదే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు బీసీ బిడ్డపై దాడి అంటూ వైసీపీ నేత జోగి రమేష్, తన సామాజిక వర్గాన్ని తెరపైకి తెచ్చారు. ఈసారి టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  13 Aug 2024 12:33 PM IST
Next Story