చంద్రబాబు గారు, గారు, గారు.. జోగి మాటల్లో ఆంతర్యమేంటి..?
పేర్ని నాని, అంబటి రాంబాబులో అప్పటికీ ఇప్పటికీ అదే ఫైర్ ఉంది. కానీ జోగి రమేష్ లో మాత్రం ఆ ఫైర్ మిస్సైంది.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీస్ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడే క్రమంలో సీఎం చంద్రబాబుకి ఇస్తున్న గౌరవం కాస్త ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు గారు, 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు, పార్టీ నేతలకు మంచి చెప్పాల్సిన వారు.. అంటూ ఎక్కడలేని గౌరవాన్ని ఇస్తూ మాట్లాడుతున్నారు జోగి రమేష్. ఆయన ఇంటిపై తాను దాడికి వెళ్లలేదని, పదే పదే గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకి చెప్పి వారి నాయకుల్ని బూతులు మాట్లాడకుండా వారించేందుకు తాను ప్రయత్నించానన్నారు. తనపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడొద్దని అంటున్నారు జోగి రమేష్.
Jogi Ramesh Comments On Chandrababu Over TDP Leaders Attack#jogiramesh #chandrababu #tdpleaders pic.twitter.com/96e7ubSV1Q
— Sakshi TV Official (@sakshitvdigital) August 17, 2024
ఇదంతా ఇప్పుడు. గతంలో జోగి రమేష్ నోటి వెంట ఎప్పుడూ చంద్రబాబు గారు అనే మాట రాలేదు. మంత్రిగా ఉన్నప్పుడు చోలా ఫోర్స్ గా మాట్లాడేవారు జోగి.
పిచ్చి కుక్క
వీధి రౌడీ..
పనికి మాలిన వెధవ..
అరేయ్ ఒరేయ్..
ఇదే ఆయన భాష. ఆ భాష ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది అధికారం కోల్పోవడం వల్ల వచ్చిన మార్పా? లేక పోలీసుల విచారణకు పదే పదే హాజరవ్వాల్సి వస్తోందన్న అసహనమా..? అమెరికాలో చదివొచ్చిన కొడుకు జైలుపాలయ్యారనే ఆవేదనా..? అనేది తేలాల్సి ఉంది.
పేర్ని నాని, అంబటి రాంబాబులో అప్పటికీ ఇప్పటికీ అదే ఫైర్ ఉంది. కానీ జోగి రమేష్ లో మాత్రం ఆ ఫైర్ మిస్సైంది. అధికారం శాశ్వతం కాదు అని చెబుతూనే.. చంద్రబాబుని బతిమిలాడుకుంటున్నట్టుగా జోగి మాటలు మారిపోయాయి. చంద్రబాబు గారు, గారు, గారు అంటూ ముఖ్యమంత్రిపై ఆయన ఎక్కడలేని గౌరవం చూపించడం ఇక్కడ విశేషం.