అమ్మినోళ్లది తప్పు లేదా..? తప్పంతా కొన్నవారిదేనా..?
జోగి రాజీవ్ అరెస్ట్ అక్రమం అని అన్నారు భరత్. అమెరికాలో చదువుకుని వచ్చిన అభంశుభం తెలియని పిల్లవాడు రాజీవ్ అని చెప్పారు.
అగ్రిగోల్డ్ భూములు కొన్నారని, సర్వే నెంబర్లు మార్చేసి వాటిని తిరిగి అమ్మేశారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రాజీవ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు రాజీవ్ కు రిమాండ్ విధించడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ జోగి రమేష్ కొడుకు తప్పేమీ లేదని అంటున్నారు వైసీపీ నేతలు. అవి అగ్రిగోల్డ్ భూములు అయితే.. వాటిని అమ్మినవారికి ముందుగా నోటీసులు ఇవ్వాలి కదా అని లాజిక్ తీస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అమ్మినవారికి నోటీసులు ఇవ్వకుండా, కేవలం కొన్నవారిని మాత్రమే కక్షగట్టి అరెస్ట్ చేశారని అంటున్నారు. జోగి రాజీవ్ అరెస్ట్ అక్రమం అని అన్నారు భరత్. అమెరికాలో చదువుకుని వచ్చిన అభంశుభం తెలియని పిల్లవాడు రాజీవ్ అని చెప్పారు.
అతి తెలివితేటలు వద్దు!!
— YSRCP Brigade (@YSRCPBrigade) August 15, 2024
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం.
- మార్గాన్ని భరత్ pic.twitter.com/30heBWmzqM
మేం రాజకీయం చేశామా..?
భూముల అక్రమాల గురించి లెక్క తీస్తే గతంలో అమరావతి విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని, తాము అధికారంలో ఉన్నప్పుడు వాటిపై రాజకీయం చేశామా అని ప్రశ్నించారు మార్గాని భరత్. భారత దేశంలో కొన్ని కోట్ల భూ వివాదాలు ఉంటాయని.. వాటన్నిటిలో ఇలాగే చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇటీవల దళిత నాయకుడైన అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని, బీసీ బిడ్డ అయిన జోగి రాజీవ్ ని అక్రమంగా అరెస్ట్ చేశారని, అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు మార్గాని భరత్.
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ నేతలంతా అండగా నిలిచారు. ఇది రాజకీయ కక్షసాధింపేనని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. జోగి కుటుంబాన్ని ఆయన పరామర్శించడానికి వస్తారా, లేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా.. అనేది వేచి చూడాలి.