శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం దశదిశలా చాటేలా
తిరుమలలో మీడియా సెంటర్ ప్రారంభం
BY Naveen Kamera4 Oct 2024 7:52 PM IST
X
Naveen Kamera Updated On: 4 Oct 2024 7:52 PM IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని దశదిశలా చాటేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం రాంభగీచా -2 విశ్రాంతి భవన్ ఫస్ట్ ఫ్లోర్ లో మీడియా సెంటర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం, భక్తుల కోసం దేవస్థానం అందజేస్తున్న వివిధ సౌకర్యాలను అందరికీ తెలియజెప్పేందుకు ఈ మీడియా సెంటర్ దోహద పడుతుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేవరకు మీడియాకు అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ సెంటర్ సేవలందిస్తుందన్నారు. మీడియా ప్రతినిధుల కోసం రెండో ఫ్లోర్ లో ప్రత్యేకంగా అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఈవీ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో శ్రీధర్, సీపీఆర్వో రవి. పీఆర్వో నీలిమ తదితరులు పాల్గొన్నారు.
Next Story