Telugu Global
Andhra Pradesh

దేశంలో మొదటిసారి దావోస్‌ వెళ్లాలని నిర్ణయించింది నేనే

విశాఖకు గూగుల్‌ కంపెనీ వస్తే గేమ్‌ఛేంజర్‌ అవుతుందన్న ఏపీ సీఎం చంద్రబాబు

దేశంలో మొదటిసారి దావోస్‌ వెళ్లాలని నిర్ణయించింది నేనే
X

దేశంలో మొదటిసారి దావోస్‌ వెళ్లాలని నిర్ణయించింది తానేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నట్లు గుర్తు చేశారు. దావోస్‌ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే.. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాను. మనం జాబ్‌ అడగడం కాదు.. ఇచ్చే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఐటీ అంటే హైటెక్‌ సిటీ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లు వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. మనం ఎక్కడున్నా జన్మభూమి, కర్మభూమి సేవ చేయాలి. తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎంఎస్‌ఎంఈలు సృష్టిస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రపంచంలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నది. ప్రధాని మోడీ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతున్నది. 2028 తర్వాత జీడీపీ వృద్ధి రేటులో చైనా భారత్‌ అధిగమిస్తుంది. గూగుల్‌ కంపెనీ వస్తే చాలా ఉద్యోగాలు వస్తాయి. విశాఖకు గూగుల్‌ కంపెనీ వస్తే గేమ్‌ఛేంజర్‌ అవుతుంది అని చంద్రబాబు చెప్పారు.

First Published:  25 Jan 2025 1:35 PM IST
Next Story