తిరుమల నడకమార్గంలో భారీ కొండచిలువ
పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిన భాస్కర్ నాయుడు
BY Naveen Kamera25 Dec 2024 5:37 PM IST
X
Naveen Kamera Updated On: 25 Dec 2024 5:37 PM IST
అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి వారి దర్శనానికి వెళ్తోన్న భక్తులకు భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అలిపిరి మెట్ల మార్గంలోని 2,500 మెట్టు వద్ద గల దుకాణంలో 14 అడుగుల పొడవున్న భారీ కొండ చిలువ దూరడంతో అక్కడి షాపుల యజమానులు టీటీడీలో పని చేసే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని అటవీప్రాంతంలో దానిని వదిలేశారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story