అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం
లోన్ సాంక్షన్ పత్రాలు అందజేసిన అధికారులు
BY Naveen Kamera11 Feb 2025 7:53 PM IST
![అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం](https://www.teluguglobal.com/h-upload/2025/02/11/1402536-amaravati-new.webp)
X
Naveen Kamera Updated On: 11 Feb 2025 7:53 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో రూ.11 వేల కోట్ల రుణం అందజేసింది. ఇటీవల ముంబయిలో జరిగిన హడ్కో గవర్నెన్స్ బాడీ సమావేశంలో అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే మంగళవారం సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబుకు హడ్కో అధికారులు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ మొత్తం ప్రక్రియను నాలుగు నెలల్లోగా పూర్తి చేసుకోవాలని.. అప్పటి వరకు హడ్కో అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ కో ఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు గత బడ్జెట్‌లోనే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు హడ్కో నుంచి మరో రూ.11 వేల రుణం మంజూరు చేయించింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ.26 కోట్ల రుణం ఇప్పించింది.
Next Story