అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం
రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ
BY Naveen Kamera22 Jan 2025 3:29 PM IST

X
Naveen Kamera Updated On: 22 Jan 2025 3:29 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రుణమిచ్చేందుకు ముందుకు వచ్చింది. రాజధాని ప్రాంతంలో పలు నిర్మాణాలకు రూ.11 వేల కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈమేరకు ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏపీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.10 వేల కోట్లకు పైగా రుణాలు ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా హడ్కో రుణంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు వేగవంతమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story