Telugu Global
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ వ‌ద్ద హైటెన్షన్.. పోలీసులకు జగన్‌ వార్నింగ్

ఎల్లకాలం ఒకే మాదిరిగా ఉండదంటూ అక్కడున్న మధుసూదన్‌ రావు అనే పోలీసు అధికారిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల విధి అని గుర్తు చేశారు జగన్.

ఏపీ అసెంబ్లీ వ‌ద్ద హైటెన్షన్.. పోలీసులకు జగన్‌ వార్నింగ్
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్‌ సహా వైసీపీ సభ్యులంతా నల్లకండువాలతో హాజరయ్యారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా నల్లకండువాలు ధరించి అసెంబ్లీ ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.


అయితే వైసీపీ సభ్యులను అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతిలో ప్లకార్డులను చించివేశారంటూ పోలీసులపై జగన్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. ఎల్లకాలం ఒకే మాదిరిగా ఉండదంటూ అక్కడున్న మధుసూదన్‌ రావు అనే పోలీసు అధికారిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల విధి అని గుర్తు చేశారు జగన్.

రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభలో వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. హత్య రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.

First Published:  22 July 2024 5:31 AM GMT
Next Story