Telugu Global
Andhra Pradesh

గర్ల్స్‌ వాష్‌రూంలో కెమెరా, 300 వీడియోలు.. గుడ్లవల్లేరు కాలేజ్‌లో దారుణం

ఈ విషయం బయటకు రావడంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వియ్‌ వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన‌ కొనసాగించారు.

గర్ల్స్‌ వాష్‌రూంలో కెమెరా, 300 వీడియోలు.. గుడ్లవల్లేరు కాలేజ్‌లో దారుణం
X

కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో దారుణం వెలుగు చూసింది. కాలేజ్‌లోని బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాలు కనిపించడం సంచలనంగా మారింది. దాదాపు 300కుపైగా విద్యార్థినుల వీడియోలు రికార్డు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోలను అదే కాలేజ్‌లోని బాయ్స్‌ హాస్టల్‌లో అమ్మినట్లు సమాచారం. గర్ల్స్‌ హాస్టల్‌లో ఉండే ఓ అమ్మాయి సాయంతో బీటెక్‌ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ వీడియోలు రికార్డు చేసినట్లు తెలుస్తోంది.



ఈ విషయం బయటకు రావడంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వియ్‌ వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన‌ కొనసాగించారు. హిడెన్ కెమెరాలో రికార్డయిన వీడియోలను అమ్ముకున్నాడంటూ బీటెక్ ఫైనల్ విద్యార్థిపై దాడికి యత్నించారు. వారం రోజుల క్రితమే హిడెన్ కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు కాలేజ్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వీడియోలు రికార్డు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌ విజయ్‌ని ప్రశ్నించారు. విజయ్‌ ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. విషయం తెలిసిన పేరెంట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  30 Aug 2024 3:23 AM GMT
Next Story