Telugu Global
Andhra Pradesh

తిరుమల, తిరుపతిలో భారీ వర్షం.. భక్తుల ఇబ్బందులు

ఘాట్‌ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారుల సూచన

తిరుమల, తిరుపతిలో భారీ వర్షం.. భక్తుల ఇబ్బందులు
X

తిరుమల, తిరుపతిలో భారీ వర్షం పడింది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఘాట్‌ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండి నీరు ఔట్‌ ఫ్లో అవుతున్నది. భారీ వర్షానికి తిరుపతి వీధులన్నీ జలమయం అయ్యాయి. లక్ష్మీపురం కూడలి, గొల్లవానిగుంటలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తున్నది. వెస్ట్‌ చర్చి కూడలిలో రైల్వే అండర్‌ బ్రిడ్జి వర్షపు నీటితో నిండిపోయింది. అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు

First Published:  12 Dec 2024 11:31 AM IST
Next Story