గ్రూప్-2 మెయిన్స్ యథాతథం... ఏపీపీఎస్సీ మరోసారి క్లారిటీ
ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారుల ధృవీకరణ

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల ఆందోళనలు,దీన్ని పరిగణనలోకి తీసుకుని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ లేఖను సర్వీస్ కమిషన్ పట్టించుకోలేదు. పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం .. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు ధృవీకరించారు. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా... 92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరుకానున్నారు.
రోస్టర్ అంశం కోర్టులో ఉన్నది. వచ్చే నెల 11న మరోసారి విచారణ జరగనున్నది. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేయడానికి ఇంకా టైమ్ ఉన్నదని, అప్పటిదాకా పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వ లేఖను పరిగణనలోకి తీసుకోలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని కుండబద్దలు కొట్టింది. లేఖలు, ఆడియో లీక్స్ పేరుతో టీడీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇసుకతోట నేషనల్ హైవేపై బైటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్నారు.