ఏపీలో ఆరోగ్యశ్రీ తీసేస్తారా..? వైసీపీ వాదన ఏంటి..?
బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని నిండా ముంచేసింది వైసీపీ అని టీడీపీ నేతలు అంటుంటే, అసలు ఆరోగ్యశ్రీనే ముంచేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ అమలు కష్టం అవుతోందని, అందుకే అందరూ కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరండని టీడీపీ నేతలు ఉచిత సలహాలిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారని కూడా వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తే పేదలు కష్టాలపాలవుతారని, ఆ పాపం కూటమి ప్రభుత్వానికి శాపంలా మారుతుందని అంటున్నారు.
ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రజలకు సూచించారు. దీంతో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వైసీపీ నేతలు మరింత బలంగా ఈ వాదనను జనంలోకి తీసుకెళ్తున్నారు. మాజీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఇది చంద్రబాబు కుట్రగా అభివర్ణిస్తున్నారు.
ఆరోగ్య శ్రీ అమలు కష్టం ,ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండని కేంద్ర సహాయ మంత్రి @JaiTDP ఎంపీ పెమ్మసాని మాటల వెనక @ncbn ఉన్నాడేమో అనిపిస్తుంది.
— YSR Congress Party (@YSRCParty) July 31, 2024
-విడదల రజిని గారు, మాజీ మంత్రి pic.twitter.com/vIcW8iyXQu
మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు. వైఎస్ఆర్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీకి అనారోగ్యం చేసిందని, కాపాడాలని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అనారోగ్యానికి గురైన "YSR" మానసపుత్రిక "ఆరోగ్యశ్రీ "నీ కాపాడండి !@JaiTDP @naralokesh @ncbn @PemmasaniOnX
— Ambati Rambabu (@AmbatiRambabu) July 31, 2024
అటు టీడీపీ కౌంటర్లివ్వడం మొదలు పెట్టింది. వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీకి నిధులు లేకుండా చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. ఆరోగ్యశ్రీకి రూ. 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయారని, వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు యాజమాన్యాలు ధర్నాకు దిగాయని గుర్తు చేశారు. గతంలో కూడా ఎంతో మంది పేదలకు ఆరోగ్యసేవలు అందలేదని, వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా.. ఆస్పత్రుల్లో భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.
ఆరోగ్యశ్రీలో కూడా రూ. 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడు. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదు. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల… pic.twitter.com/tH9omMEQ9i
— Telugu Desam Party (@JaiTDP) July 31, 2024
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆరోగ్యశ్రీని నిండా ముంచేసింది వైసీపీ అని టీడీపీ నేతలు అంటుంటే, అసలు ఆరోగ్యశ్రీనే ముంచేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చూడమ్మా భారతి! ఆరోగ్యశ్రీ బకాయి పెట్టింది మీ శ్రీవారు. అది 1600 కోట్లు అని రాసింది మీ విష పుత్రిక సాక్షి. నీ భర్త చేతకానితనం, మూర్ఖత్వం గురించి నీకంటే గొప్పగా ఎవరికి తెలియదని సాక్షిలో రాతల ద్వారా నిరూపించావు.#FekuJagan #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/HCdVPitier
— Telugu Desam Party (@JaiTDP) July 31, 2024