సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు
ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
BY Raju Asari2 March 2025 3:05 PM IST

X
Raju Asari Updated On: 2 March 2025 3:05 PM IST
సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతోపాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలున్నాయి. 2020-2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లి ఆలిండియా సర్వీసు నిబంధనలను సునీల్‌కుమార్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆప్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిది. ఈ క్రమంలో సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
Next Story