Telugu Global
Andhra Pradesh

ఇవి ఈవీఎం ఎన్నికలు కాదు.. గెలుపు మాదే

తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు గుడివాడ అమర్నాథ్. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు.

ఇవి ఈవీఎం ఎన్నికలు కాదు.. గెలుపు మాదే
X

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈవీఎంలలో జరగవని, బ్యాలెట్ లో జరుగుతాయని.. ఆ విషయం సీఎం చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈవీఎంలలో గోల్ మాల్ జరిగినట్టు ఈ ఎన్నికల్లో జరగబోవని, విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు ఇచ్చి ఈ ఎన్నికల్లో తమ పార్టీ నేతల్ని కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ.


విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 600కి పైగా ఓట్లు వైసీపీకి ఉన్నాయని, కూటమికి 180నుంచి 200 ఓట్లు ఉన్నాయని చెప్పారు గుడివాడ అమర్నాథ్. తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని అక్కడ పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు. ఎన్టీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నప్పటినుంచి చంద్రబాబుకి వైశ్రాయ్ రాజకీయం అలవాటు అని సెటైర్లు పేల్చారు. స్థానిక సంస్థల ప్రతినిధులు టీడీపీవైపు వచ్చేస్తున్నారంటూ ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారని, కానీ అది సక్సెస్ కాదని అన్నారు గుడివాడ.

తెలంగాణ సీఎం ఏం చేశారో తెలుసా..?

ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబు తరపున ఓటుకు నోటుకోసం బేరసారాలు ఆడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుందని అన్నారు గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ఇప్పటికీ అదే పద్ధతి ఫాలో అవుతున్నారని చెప్పారు. అసలు టీడీపీ పోటీకి దిగడమే పద్ధతి కాదన్నారు. వారు పోటీ చేస్తున్నారంటే, ఓటుకు నోటుతో ఓటర్లను కొనేందుకు సిద్ధమయ్యారని అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే అంతిమంగా విజయం తమదేనని అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

First Published:  12 Aug 2024 8:45 AM GMT
Next Story