Telugu Global
Andhra Pradesh

పార్టీ మారే వారికి అంబటి సూచన.. ఏంటంటే!

మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన ఓడినా MLC పదవి ఇచ్చి మంత్రిని చేశారని గుర్తుచేశారు. మోపిదేవి పార్టీ వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

పార్టీ మారే వారికి అంబటి సూచన.. ఏంటంటే!
X

అధికారం కోల్పోవడంతో వైసీపీకి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు నేతలు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ఆళ్ల నాని పార్టీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా పోతుల సునీత సైతం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తూ అధినేత జగన్‌కు లేఖ రాశారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకూ వైసీపీ అధికారికంగా ఫిరాయింపులపై స్పందించలేదు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రధానంగా మోపిదేవి గురించి ప్రస్తావించిన అంబటి.. మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన ఓడినా MLC పదవి ఇచ్చి మంత్రిని చేశారని గుర్తుచేశారు. మోపిదేవి పార్టీ వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

అధికార పార్టీలో చేరడం అంటే క్యారెక్టర్ కోల్పోవడమే అన్నారు అంబటి. చంద్రబాబు రాజకీయ జీవితం అందరికీ తెలిసిందేనన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలు మారడం మంచి పద్దతి కాదని సూచించారు.

First Published:  28 Aug 2024 4:13 PM GMT
Next Story