దువ్వాడపై వేటు వేసిన జగన్
పార్టీలో మరికొన్ని కీలక పదవుల్ని కూడా భర్తీ చేశారు జగన్. కోఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని తాజాగా నియమించారు.
కాస్త ఆలస్యంగా అయినా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న ఆయన్ను పక్కకు తప్పించారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ ని నియమించారు. గతంలో పేరాడ తిలక్ టెక్కలి సమన్వయకర్తగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన్ను తిరిగి టెక్కలి అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు జగన్.
పార్టీకి సంబంధించి మరికొన్ని కీలక పదవుల్ని కూడా భర్తీ చేశారు జగన్. కోఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని తాజాగా నియమించారు. అనుబంధ విభాగాలకు సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఇచ్చారు జగన్.
కీలకమైన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు జగన్. ఇక పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఏలూరు జిల్లాకు సంబంధించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు జగన్.