Telugu Global
Andhra Pradesh

దువ్వాడ విషయంలో ఎట్టకేలకు స్పందించిన వైసీపీ

వైసీపీ ఎంత సైలెంట్ గా ఉండాలనుకున్నా.. పదే పదే ఈ విషయంలో రెచ్చగొట్టి చివరకు అటు నుంచి ట్వీట్ పడేలా చేసింది టీడీపీ.

దువ్వాడ విషయంలో ఎట్టకేలకు స్పందించిన వైసీపీ
X

దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా రచ్చ జరుగుతున్నా వైసీపీ మాత్రం సైలెంట్ గా ఉంది. వైసీపీ తరపున ఏ ఒక్క నాయకుడు కూడా ఆ వ్యవహారంపై స్పందించలేదు. కనీసం వైసీపీ సోషల్ మీడియాలో కూడా చిన్న కామెంట్ లేదు. కానీ టీడీపీ వదిలి పెట్టలేదు, పదే పదే సోషల్ మీడియా ద్వారా కవ్వించింది టీడీపీ. ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఈ విషయంలో తొలిసారి వైసీపీ నుంచి అధికారిక ట్వీట్ పడింది.

అది భార్యాభర్తల వివాదం..

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారాన్ని కేవలం భార్యా భర్తల వివాదంగా తేల్చి చెప్పింది వైసీపీ. భార్యాభర్తల వివాదంలో చలికాచుకోవడానికి సిగ్గులేదా అంటూ టీడీపీకి కౌంటర్ ట్వీట్ వేసింది. మీ పంచాయితీలు రాస్తే… ఇక్కడ ట్విట్టర్‌ స్పేస్ కూడా సరిపోదేమో.. అంటూ కొన్ని ఉదాహరణలు పేర్కొంది.

-తుపాకీ కాల్పులు వెనుక అసలు కథ ఏంటి?

-మాలోకంతో ఇబ్బందిపడిన పనిమనిషి ఎవరు?

-ఆ టీచర్‌ జీవితం ఎలా నాశనమైంది?

-ఇంట్లో ఆత్మహత్య ఎందుకు జరిగింది?

-కాల్‌మనీ కేసులో స్టార్లు ఎవరు?

అంటూ కొన్ని ప్రశ్నల్ని సంధించింది వైసీపీ.


వైసీపీ ఎంత సైలెంట్ గా ఉన్నా.. పదే పదే ఈ విషయంలో రెచ్చగొట్టి చివరకు అటు నుంచి ట్వీట్ పడేలా చేసింది టీడీపీ. భార్యా భర్తల వివాదంలో చలికాచుకోడానికి సిగ్గులేదా అంటూ వైసీపీ పెట్టిన పోస్టింగ్ ని తిరిగి వారికే రివర్స్ లో తగిలిస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో పవన్ కల్యాణ్ వ్యవహారంలో చలికాచుకోవాలనుకున్నది ఎవరని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద దువ్వాడ ఫ్యామిలీ మేటర్.. టీడీపీకి చెలగాటం, వైసీపీకి ప్రాణ సంకటంలా మారింది.

First Published:  12 Aug 2024 2:52 PM IST
Next Story