ఏపీలో ప్రతి నెలా 10వతేదీ 'పేదల సేవలో'..
గత ఐదేళ్లలో జిల్లా కలెక్టర్ల మీటింగ్ ఒక్కసారికూడా పెట్టలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. పాలనలో అదొక భాగమని, కానీ దాన్ని సరిగా చేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.
జీరో పావర్టీ అనేది తమ ప్రథమ కర్తవ్యం అని చెప్పారు సీఎం చంద్రబాబు. పేదరిక నిర్మూలనకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పీ4 మోడల్ ద్వారా పేదరికాన్ని నిర్మూలిద్దామన్నారు. ఇకపై ప్రతి నెల 10వతేదీన 'పేదల సేవలో' అనే కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు మెరుగైన ఉపాధి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు, మంత్రులతో జరిగిన సమావేశంలో కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
ప్రజాస్వామ్యంలో నియంతలెవరూ రెండోసారి గెలవలేదని గుర్తు చేశారు చంద్రబాబు. గత ప్రభుత్వంలోని మంత్రులెవరూ ఈసారి అసెంబ్లీకి కూడా రాలేదన్నారు. కలెక్టర్లు ప్రజలతో గౌరవంగా మసలుకోవాలని, లేకపోతే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. గత ముఖ్యమంత్రి, మొదటి కలెక్టర్స్ మీటింగ్ లోనే, విధ్వంసం చేస్తున్నా అని చెప్పి, ఆ మీటింగ్ నుంచే విధ్వంసం మొదలు పెట్టారన్నారు చంద్రబాబు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, అధికారులని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి చూశామన్నారు. చరిత్రలో చేతకాని పాలనలు, అవినీతి పాలనలు చూశాం కానీ, మొదటి సారి ఒక విధ్వంసం చేసే పాలనను, గత ప్రభుత్వంలోనే చూశామన్నారు చంద్రబాబు.
గత ఐదేళ్లలో జిల్లా కలెక్టర్ల మీటింగ్ ఒక్కసారికూడా పెట్టలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. పాలనలో అదొక భాగమని, కానీ దాన్ని సరిగా చేయలేదన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. అయితే సుదీర్ఘంగా సుత్తికొట్టబోనని, గంట, రెండు గంటల్లో తన మీటింగ్ లు పూర్తి చేస్తానన్నారు. సాంకేతికతను బాగా ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు ఘటనను కూడా గుర్తు చేశారాయన. ఫేక్ న్యూస్ ని ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దన్నారు.