Telugu Global
Andhra Pradesh

ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు

అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రోడ్ల అభివృద్ధి, రైల్వే జోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం

ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు
X

రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు.. హస్తినకు చేరుకోగానే నేరుగా ప్రధానితో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రోడ్ల అభివృద్ధి, రైల్వే జోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య విభజన హామీలూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అనంతరం రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో సీఎం భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురితో సమావేశమౌతారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, రాత్రి 11.15 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉన్నది.

First Published:  7 Oct 2024 5:21 PM IST
Next Story