Telugu Global
Andhra Pradesh

ఆర్థికంగా గట్టెక్కడానికి సహకరించండి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పరిణామాలను పనగారియా దృష్టికి తెచ్చిన ఏపీ సీఎం

ఆర్థికంగా గట్టెక్కడానికి సహకరించండి
X

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో సుమారు 2 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పరిణామాలను పనగారియా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రజంటేషన్‌ ఇచ్చారు. 2019-2024 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన వివరించారు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి తక్కువ జీడీపీ ఉన్నది. ఐదేళ్ల దుష్పరిపాలనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ఏపీ ఆర్థికస్థితి దారుణంగా ఉందని.. అప్పడు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతిఆయోగ్‌ చెప్పింది. గత ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. రూ. లక్షన్నర కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఆర్థికంగా గట్కెక్కించే చర్యలకు సహకరించాలి అని అరవింద్‌ పనగారియాను చంద్రబాబు కోరారు.

First Published:  3 Feb 2025 4:07 PM IST
Next Story