Telugu Global
Andhra Pradesh

మిర్చికి రూ. 11,600 మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి

ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కోరామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

మిర్చికి రూ. 11,600 మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి
X

ఆంధ్రప్రదేశ్‌ మిర్చి రైతుల ఆందోళన కూటమి ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది. మాజీ సీఎం జగన్‌ వారికి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కోరామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. మిర్చికి రూ. 11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మిర్చి ఎగుమతులు, ఏపీ మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించే అంశంపై భేటీలో చర్చించామన్నారు. సమస్య చెప్పిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఎగుమతిదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కెట్‌ ధర, ఉత్పత్తి ఖర్చులకు మధ్య తేడా పరిశీలిస్తామన్నారు. ఏపీలో మిర్చి రైతుల కష్టాల్లో ఉన్నారని చెప్పాం. రాయలసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాల మిర్చి రైతులకు లబ్ధి కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.

First Published:  21 Feb 2025 12:40 PM IST
Next Story