Telugu Global
Andhra Pradesh

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న చంద్రబాబు

భవిష్యత్తు అంతా పర్యాటకానిదేనన్న ఏపీ సీఎం

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న చంద్రబాబు
X

ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులు ఉన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం పాతాళగంట నుంచి చంద్రబాబు రోప్‌ వేలో శ్రీశైలం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీశైల మల్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి తీర్థ ప్రసాదాలు అందేశారు.అంతకుముందు పౌర విమానయాన శాఖ, ఏపీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పాతాల గంగలో 'సీ ప్లేన్‌' డెమో లాంచ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏపీ రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఎఫ్‌ఐసీసీఐ భాగస్వాములుగా ఉన్నారు.

శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో సీఎం చంద్రబాబు 'సీ ప్లేన్‌' ప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా 'సీ ప్లేన్‌' ల్యాండ్‌ అయ్యింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా పర్యాటకానిదేనని ఏపీ సీఎం అన్నారు. భవిష్యత్తు లో ఏ ఇజం ఉండదు. టూరిజం ఒక్కటే ఉంటుందన్నారు. దేశంలో మొదటిసారి పర్యాటకంగా 'సీ ప్లేన్‌' వినియోగం ఏపీ నుంచి ప్రారంభం కానున్నదన్నారు. సీ ప్లేన్‌ ప్రయాణం.. వినూత్న అవకాశమిది. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది. సాంకేతికత చాలా వేగంగా పెరుగుతున్నది. దానిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. నిత్యం కొత్త ఆలోచనలు చేయాలి. రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీప్లేన్‌ ద్వారా రవాణ సౌకర్యం లభిస్తుందన్నారు.

First Published:  9 Nov 2024 10:40 AM GMT
Next Story