Telugu Global
Andhra Pradesh

మీది ముఠా రాజకీయం.. మీది ఫేక్ రాజకీయం

సహజంగా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలాంటి వాటికి బదులిస్తుంటారు నేతలు. లేదా పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమాధానం చెబుతుంటారు. కానీ ఇక్కడ నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు.

మీది ముఠా రాజకీయం.. మీది ఫేక్ రాజకీయం
X

ఏపీలో ముఠాల పాలన జరుగుతోందని జగన్ ఘాటు ట్వీట్ వేశారు, మరోవైపు సీఎం చంద్రబాబు వారివి ఫేక్ రాజకీయాలంటూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు పార్టీల అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోరాటం జరిగేది, ఇప్పుడు నేరుగా నాయకులే రంగంలోకి దిగారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ నేరుగా ముఖ్యమంత్రి ఓ వీడియో పోస్ట్ చేయడం విశేషం.


అసలేం జరిగింది..?

బాపట్ల జిల్లా భట్టిప్రోలు ఎస్సైతో టీడీపీ కార్యకర్త ఘర్షణ పడ్డారని, ఎస్సైని చొక్కా పట్టుకుని నిలదీశారంటూ సాక్షిలో ఓ కథనం వచ్చింది. దీంతో పోలీసుల్లో కూడా కాస్త కలవరం ఏర్పడింది. వెంటనే టీడీపీ నష్టనివారణ చర్యలకు దిగింది. అవి తప్పుడు కథనాలని, మార్ఫింగ్ ఫొటోలతో సాక్షి తప్పుడు వార్తలిస్తోందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఫేక్ పనులు చేస్తుంటే సాక్షి ఫేక్ రాతలు రాస్తోందని ట్వీట్ వేశారు లోకేష్.


సహజంగా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలాంటి వాటికి బదులిస్తుంటారు నేతలు. లేదా పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమాధానం చెబుతుంటారు. కానీ నేరుగా ఇక్కడ చంద్రబాబు రంగంలోకి దిగారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి అది ఫేక్ న్యూస్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఫేక్ న్యూస్ నమ్మొద్దు..ఫేక్ గాళ్లను నమ్మొద్దు..ఫేక్ రాజకీయాల ట్రాప్ లో పడి మోసపోవద్దు! అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు.

First Published:  5 Aug 2024 2:23 AM GMT
Next Story