వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న కేంద్ర మంత్రులు
BY Naveen Kamera17 Jan 2025 5:35 PM IST

X
Naveen Kamera Updated On: 17 Jan 2025 5:35 PM IST
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించడానికి కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని కేంద్ర మంత్రులు తెలిపారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ప్లాంటు కార్మికులు, కుటుంబాలకు భద్రతే ధ్యేయంగా కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు.
Next Story