రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభానికి శనివారం సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. సీఆర్‌డీఏ ఆఫీస్ పనులు ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు చంద్రబాబు పనులు ప్రారంభిస్తారు. రూ. 160 కోట్లతో గతంలో ఏడంతస్తుల్లో సీఆర్‌డీఏ ఆఫీస్ పనులు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలిపివేశారు. పనలు పునఃప్రారంభించడంపై ఈ నెల 16న జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Previous Articleప్రో కబడ్డి లీగ్ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ బోణీ
Next Article గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్
Keep Reading
Add A Comment