ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోం మంత్రి వంగళపూడి అనిత భేటీ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం ఆమెనే వెల్లడించారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఏపీలో జరుగుతోన్న హత్యలు, అత్యాచారాలపై తీవ్రంగా స్పందించారు. తానే హోం మంత్రిని అయి ఉంటే చర్యలు వేరుగా ఉండేవన్నారు. హోం మంత్రి ఫెయిల్యూర్ తోనే వరుస ఘటనలు జరుగుతున్నట్టుగా పవన్ కామెంట్ చేశారు. వాటికి హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి కేంద్ర హోం శాఖ మంత్రితో సమావేశమయ్యారు. గురువారం ఏపీ సెక్రటేరియట్ లో అనిత డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు, వాటిపై హోం శాఖ తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతోన్న నేరాలను సీరియస్ గా తీసుకోవాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిప్యూటీ సీఎం తనకు సూచించారని అనిత వెల్లడించారు. ప్రతిక్షణం ప్రజల కోసం పని చేసే ప్రజా ప్రభుత్వం తమదని పేర్కొన్నారు.
Previous Articleకెప్టెన్‌తో గొడవ..మ్యాచ్ మధ్యలో మైదానం వీడిన విండీస్ బౌలర్
Next Article అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వెండర్లపై ఈడీ దాడులు
Keep Reading
Add A Comment