ఇక తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

ప్రజలందరికీ ప్రభుత్వ ఉత్తర్వులు అర్థమయ్యేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. మొదట ఇంగ్లిష్‌లో జీవోలు పబ్లిక్ డొమైన్ లో అప్ లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోపే ఆ జీవోను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నది. జీవోలను ట్రాన్స్‌లేట్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలు ఉపయోగించుకోవాలని జేఏసీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ ఆయా శాఖలకు సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు పాలన వ్యవహారాలు తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తెలుగులో జీవోలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.