ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల కేటాయింపు, రాష్ట్రంలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై క్యాబినెట్‌లో చర్చ
BY Raju Asari17 Jan 2025 1:17 PM IST
X
Raju Asari Updated On: 17 Jan 2025 1:17 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాల కేటాయింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 113 నియోజకవర్గాల్లో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటునకు గతంలోన ఆమోదం లభించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, వృద్ధి రేటుపై పెంపుపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నది. అందరికీ ఇళ్ల పథకం విధివిధానల జారీకి అమోదం తెలిపే అవకాశం ఉన్నది. అలాగే క్యాబినెట్ సూపర్ సిక్స్ పథకాలపై ఫోకస్ పెట్టనున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Next Story