24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
28న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కూటమి ప్రభుత్వం
BY Naveen Kamera7 Feb 2025 4:10 PM IST
![24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401227-ap-assembly-1.webp)
X
Naveen Kamera Updated On: 7 Feb 2025 4:10 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24 నుంచి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 24న అసెంబ్లీ, కౌన్సిల్ ను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టి చర్చిస్తారు. 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025 -26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెడుతారు. కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ, కౌన్సిల్ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలో ఖరారు చేస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సమాచారంతో సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Next Story