బిల్‌గేట్స్‌కు థాంక్స్ చెప్పిన చంద్రబాబు
'సోర్స్ కోడ్' పేరిట పుస్తకం విడుదల చేయనున్న బిల్‌గేట్స్.. అది ఏపీ సీఎంకు బహూకరించిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
BY Raju Asari25 Jan 2025 11:27 AM IST
X
Raju Asari Updated On: 25 Jan 2025 11:28 AM IST
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ త్వరలో ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన కాపీని తనకు బహూకరించినందుకు ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సీఎం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు 'సోర్స్ కోడ్' పేరిట నా స్నేహితుడు బిల్‌గేట్స్ పుస్తకం విడుదల చేయనున్నారు. త్వరలో విడుదలకానున్న పుస్తక కాపీ నాకు బహూకరించినందుకు ధన్యవాదాలు. బిల్‌గేట్స్ తన జీవిత ప్రయాణంలోని అనుభవాలు, పాఠాల సమాహారంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. కాలేజీ వదిలి మైక్రోసాఫ్ట్ ప్రారంభ నిర్ణయం వరకు ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం. బిల్‌గేట్స్‌కు మా శుభాకాంక్షలు.
Next Story