సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మోసం
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అని, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి.
అమ్మఒడిని తల్లికి వందనంగా మారుస్తూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలపై ఏపీలో రచ్చ జరుగుతున్నా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా.. అధికార పక్షం నుంచి ఎవరూ స్పందించడంలేదు. దీంతో తల్లికి వందనం పథకం విషయంలో ప్రజల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఇందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని, సీఎం చంద్రబాబుకి ఇలాంటి మోసాలు అలవాటేనని చెప్పారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గతంలో రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసిన చంద్రబాబు.. ఈసారి తల్లికి వందనం పథకం విషయంలో మరింత పెద్ద మోసానికి తెరతీశారన్నారు.
తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారు బాబూ ?
— YSR Congress Party (@YSRCParty) July 11, 2024
ఎన్నికలప్పుడు వాగ్ధానాలు చేయటం అధికారంలోకి వచ్చాక మాట తప్పటం @ncbnకి అలవాటే...
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి pic.twitter.com/zldvRYoRo7
కూటమి ప్రభుత్వం తెరపైకి తెస్తున్నది తల్లికి వందనం కాదని, తల్లికి మోసం అని విమర్శించారు అంబటి. ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నారని, కానీ ఇది సూపర్ మోసం అని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వానికి రాని ఆలోచనని అమలులోకి తీసుకొచ్చిన నాయకుడు జగన్ అని, అమ్మఒడి జగన్ మానస పుత్రిక అని చెప్పారు. ఆ పథకం పేరు చెప్పి, అంతకు మించి ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు వారిని నిండా ముంచుతున్నారని ఎద్దేవా చేశారు అంబటి.
గతంలో చంద్రబాబు, లోకేష్ సూపర్ సిక్స్ గురించి, తల్లికి వందనం గురించి గొప్పగా చెప్పారని పాత వీడియోలను తన ప్రెస్ మీట్ లో ప్లే చేసి చూపించారు మాజీ మంత్రి అంబటి. నిమ్మల రామానాయుడు వంటి వారు ఇంటింటికీ వెళ్లి.. మీకు 15 వేలు, మీకు 15వేలు.. అంటూ తలా 15వేల రూపాయలు వస్తాయని మభ్యపెట్టారని, ఇప్పుడు మార్గదర్శకాల్లో ఒక బిడ్డకే అనే నిబంధన చేర్చారని విమర్శించారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అని, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడుచంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి.