Telugu Global
Andhra Pradesh

పొమ్మన లేక పొగ.. సీనియర్‌ ఐపీఎస్‌లపై కూటమి సర్కార్‌ కక్ష!

పోస్టింగ్‌లు ఇవ్వని ఐపీఎస్‌లు ప్రతి రోజు ఉదయం10 గంటలకు డీజీపీ ఆఫీసుకు రావాలని, అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆఫీసర్స్‌ వెయిటింగ్‌ రూమ్‌లో రోజంతా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

పొమ్మన లేక పొగ.. సీనియర్‌ ఐపీఎస్‌లపై కూటమి సర్కార్‌ కక్ష!
X

ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్‌ అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టింది. గ‌త వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ఆరోపిస్తూ.. రెండు నెలలుగా వారికి ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు.


తాజాగా పోస్టింగ్ ఇవ్వని అధికారులకు సంబంధించి వింత ఆదేశాలు జారీ చేసింది కూట‌మి ప్ర‌భుత్వం. ఈ మేరకు డీజీపీ వారికి మెమోలు జారీ చేశారు. పోస్టింగ్‌లు ఇవ్వని ఐపీఎస్‌లు ప్రతి రోజు ఉదయం10 గంటలకు డీజీపీ ఆఫీసుకు రావాలని, అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం పెట్టి ఆఫీసర్స్‌ వెయిటింగ్‌ రూమ్‌లో రోజంతా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా అత్యవసరమైన పని అప్పగిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ ఆదేశాలపై సీనియర్ ఐపీఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



ఈ జాబితాలో 16 మంది ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. PSR ఆంజనేయులు, P.V. సునీల్ కుమార్, ఎన్.సంజయ్, పాలరాజు, కొల్లి రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయారావు, విశాల్ గున్ని, అన్బురాజన్, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జోషువా, కృష్ణకాంత్ పటేల్ ఉన్నారు.

First Published:  14 Aug 2024 4:12 PM IST
Next Story