ఆరు నెలల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్
కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమేనన్న మంత్రి టీజీ భరత్
BY Raju Asari28 Nov 2024 4:15 PM IST
X
Raju Asari Updated On: 28 Nov 2024 4:16 PM IST
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటునకు స్థల పరిశీలన చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసిందని ధ్వజమెత్తారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడాతమని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రకటనకు ముందే బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించామన్నారు. బెంచ్ శాశ్వత భవన నిర్మాణానికి ఏడాదిన్నర సమయం పట్టొచ్చన్నారు. ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలూ కర్నూలులోనే ఉంటాయన్నారు. కర్నూలు నుంచి కార్యాలయాల తరలింపు అనేది వైసీపీ దుష్ప్రచారమేనని మంత్రి తెలిపారు.
Next Story