అమ్మాయిలూ ఏదన్నా షేర్ చేసుకోండి గానీ ఇవి మాత్రం వేరేవాళ్ళవి అస్సలు వాడకండి

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు..సహజమైన సౌందర్యానికి ఇంకొంత సొగసు అద్దటానికి చాలా మంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు.

Advertisement
Update:2024-06-05 22:47 IST

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు..సహజమైన సౌందర్యానికి ఇంకొంత సొగసు అద్దటానికి చాలా మంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. అయితే కొందరు మాత్రం మన ఫ్రెండే కదా, మన చెల్లె కదా అని వారి బ్యూటీ ప్రొడక్ట్స్ ని సరదాగా వాడేస్తుంటారు. తనవి వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటుంటారు. అది ఎంత ప్రమాదమో మీకు తెలుసా? అలాంటి అలవాటు మీకు ఉన్నట్టు అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే..

 

చాలా మంది యువతులకు తాము కొనుక్కున్న లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్ కంటే పక్కవాళ్ళదే ఎక్కువ నచ్చుతుంది. సరదాకో, సూట్ అయ్యిందనో వేరేవాళ్ళది యూజ్ చేస్తుంటారు. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోవాలంటున్నారు నిపుణులు. ఇతరులవి యూజ్ చేసినప్పుడు వాటిపై ఉన్న బ్యాక్టీరియా మీ పెదవుల పైకి చేరే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

కొంతమంది ఫౌండేషన్, ఐ షాడో, మస్కారా, ఐ లైనర్ వంటివి షేర్ చేసుకుంటుంటారు. వీటిని కూడా ఒకరి కంటే ఎక్కువమంది చేతితో తాకినా లేదా బ్రష్‌తో అప్త్లె చేసుకున్నా అందులో కూడా బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా మొటిమలు రావడం, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే కళ్ళకు సంబంధించిన ఉత్పత్తుల్లోని బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రబడడం, నీళ్లు కారడం, మండడం.. వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని సూచిస్తున్నారు.

 

ఇక పూర్తి మేకప్ కిట్ యూజ్ చేసేవాళ్ళయితే మేకప్ బ్రష్​ను మాత్రం ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇతరులు వాటిని యూజ్ చేసినప్పుడు వారి చర్మం మీద ఉండే బ్యాక్టీరియా, క్రిములు.. వంటివి మేకప్ ప్రొడక్ట్స్​లోకే కాదు.. మీ చర్మం మీదకు కూడా చేరతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే.. మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంకూడా చాలా అవసరం. వీటితోపాటు హెయిర్ బ్రష్‌లు, నెయిల్‌పాలిష్, క్లెన్సింగ్‌ స్పాంజ్‌లు, మేకప్ వేసుకోవడానికి వాడే పఫ్‌లు, ఐ లాష్ కర్లర్, ట్వీజర్స్, ప్లక్కర్స్, స్నానానికి ఉపయోగించే లుఫా మొదలైనవన్నీ ఇతరులతో పంచుకోకుండా ఉండడం మంచిదని  సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News