సిటీకి దగ్గర్లో వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పీరియెన్స్.. ఎక్కడంటే..

దసరా సెలవల్లో టూర్ వేయాలనుకునేవాళ్లకు హైదరాబాద్‌కు దగ్గర్లో మంచి వైల్డ్ లైఫ్ టూర్ రెడీగా ఉంది. సిటీకి కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అరుదైన పక్షులు, మొసళ్లతో పాటు రకరకాల అటవీ జంతువులతో కూడిన వైల్డ్‌లైఫ్ అండ్ బర్డ్ శాంక్చువరీ ఉంది.

Advertisement
Update:2023-10-16 16:27 IST

సిటీకి దగ్గర్లో వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పీరియెన్స్.. ఎక్కడంటే..

దసరా సెలవల్లో టూర్ వేయాలనుకునేవాళ్లకు హైదరాబాద్‌కు దగ్గర్లో మంచి వైల్డ్ లైఫ్ టూర్ రెడీగా ఉంది. సిటీకి కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే అరుదైన పక్షులు, మొసళ్లతో పాటు రకరకాల అటవీ జంతువులతో కూడిన వైల్డ్‌లైఫ్ అండ్ బర్డ్ శాంక్చువరీ ఉంది.

వైల్డ్‌లైఫ్‌ను ఇష్టపడేవాళ్లకు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఉన్న మంజీరా వైల్డ్‌లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ.. మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ఈ అభయారణ్యం హైదరాబాద్ సిటీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విశాలంగా ఉండే మంజీరా నదిపై తొమ్మిది చిన్నచిన్న ఐలాండ్స్ ఉంటాయి. విదేశాల నుంచి వలస వచ్చిన అరుదైన రంగురంగుల పక్షులతో పాటు రకరకాల నీటి జంతవులు దర్శనమిస్తాయి. ఈ శాంక్చురీలో పచ్చని చెట్లు, వెడల్పాటి నది, మధ్యలో అక్కడక్కడా ఉన్న ఐలాండ్స్ టూరిస్టులకి కొత్త అనుభూతినిస్తాయి. ఈ శాంక్చురీ సంగారెడ్డి జిల్లాలోని కాలబూర్ లో మంజీర, సింగూరు బ్యారేజీల మధ్య దాదాపు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ముఖ్యంగా అంతరించిపోతున్న మగ్గర్ జాతి మొసళ్ళకు ఇది సంరక్షణా కేంద్రంగా ఉంది.

ఈ ఐలాండ్స్‌కు శీతాకాలంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా నుంచి రకరకాల పక్షులు వలస వస్తాయి. ఇక్కడ సుమారు 70 రకాల అరుదైన పక్షులు కనువిందు చేస్తాయి. బోటులో షికారు చేస్తూ పక్షుల్ని దగ్గరగా చూడొచ్చు. అరుదైన బాతులు, ఫ్లెమింగో పక్షులు, పెయింటెడ్ స్టార్క్, ఓరియెంటల్ వైట్ ఇబిస్ వంటి వలస పక్షులు ఇక్కడ ఫేమస్. ఇక్కడ మ్యూజియం, లైబ్రరీతో పాటు ఆడిటోరియం కూడా ఉంది. అందులో పక్షులు, జంతువులకి సంబంధించిన వీడియోలు ప్లే చేస్తారు.

ఇక్కడికి దగ్గర్లో కాకతీయ రాజులు కట్టించిన పురాతన శివాలయం కూడా ఉంది. వేయిస్తంభాల గుడిని పోలి ఉండే ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు. అలాగే కాకతీయుల కాలానికి చెందిన పురాతనమైన సంగమేశ్వరాలయం కూడా ఉంది. ఇక్కడికి వెళ్లే టూరిస్టుల కోసం దగ్గర్లోని సింగూర్, సదాశివపేటలో వసతి సౌకర్యాలున్నాయి. మెదక్, సంగారెడ్డి టౌన్ లలో రెస్టారెంట్లు, హోటళ్ల వంటి సదుపాయాలున్నాయి.

ఇలా వెళ్లాలి

మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంగారెడ్డి నుంచి 5 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 64 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి బస్సులు తిరుగుతాయి. అక్కడ్నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంక్చురికి ఆటోలో చేరుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News