మహా కుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్లు
జనవరి 18 నుంచి నడుపనున్న సౌత్ సెంట్రల్ రైల్వే
ఉత్తరప్రదేశ్ లో భోగి పండుగ నుంచి శివరాత్రి వరకు నిర్వహించనున్న మహా కుంభమేళాకు సౌత్ సెంట్రల్ రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఆ రైళ్ల రాకపోకలకు సంబంధించిన టైం టేబుల్ ను శుక్రవారం విడుదల చేసింది. జనవరి 18న మౌలాలి నుంచి ఆజాంఘర్, 19న మౌలాలి నుంచి గయా, 20న ఆజాంఘర్ నుంచి మౌలాలి, 21న గయా నుంచి మౌలాలి, 22న మౌలాలి నుంచి గయా, 24న గుంటూరు నుంచి ఆజాంఘర్, అదే రోజు గయా నుంచి మౌలాలి, 25న గుంటూరు నుంచి గయా, 26న ఆజాంఘర్ నుంచి గుంటూరు, 27న గయా నుంచి గుంటూరు, 22న నాందేడ్ నుంచి పాట్నా, 24న పాట్నా నుంచి నాందేడ్, 25న కాచిగూడ నుంచి పాట్నా, 27న పాట్నా నుంచి కాచిగూడ, ఫిబ్రవరి 21న మౌలాలి నుంచి ఆజాంఘర్, 23న ఆజాంఘర్ నుంచి మౌలాలికి ఈ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. గుంటూరు నుంచి బయల్దేరే ప్రత్యేక రైళ్లు విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్‌లలో ఆగుతాయి. మౌలాలి నుంచి బయల్దేరే ట్రైన్స్ చర్లపల్లి, జనగామ, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ల మీదుగా వెళ్తాయి. కాచిగూడ నుంచి బయల్దేరే ప్రత్యేక రైలు బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్ బాసర స్టేషన్‌ల మీదుగా వెళ్లనుంది.