సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!

ఈ సమ్మర్‌‌కి అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా అలాగే ఇతర ఇబ్బందులు కలగకుండా కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలి.

Advertisement
Update:2024-03-21 15:13 IST

సమ్మర్ సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? మిగతా సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్‌లో టూర్స్ వెళ్లేవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ సమ్మర్‌‌కి అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా అలాగే ఇతర ఇబ్బందులు కలగకుండా కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలి.

ముందుగా సమ్మర్ ట్రిప్స్‌లో జర్నీ టైంను రాత్రివేళల్లో ప్లాన్ చేసుకుంటే మంచిది. పగటి పూట ప్రయాణాలు ఈ సీజన్‌లో అంత అనుకూలంగా ఉండవు. అలాగే సమ్మర్ ట్రిప్ కోసం చల్లని ప్రాంతాలను ఎంచుకుంటే బాగుంటుంది. వెళ్లబోయేముందు అక్కడి వాతావరణ పరిస్థితులపై కూడా ఒక అంచనాకు రావాలి.

హిల్ స్టేషన్స్‌లో ట్రెక్కింగ్ లాంటివి ప్లాన్ చేసుకుంటే వాటిని ఎర్లీ మార్నింగ్ మొదలుపెట్టి ఉదయం పది గంటలలోపు ముగించేలా చూసుకోవాలి. వెంట స్నాక్స్ తీసుకెళ్లడం, ఎండ నేరుగా పడకుండా హ్యాట్ ధరించడం, సన్ స్క్రీన్ లోషన్ వాడడం కూడా ముఖ్యమే.

సమ్మర్ ప్రయాణాల్లో దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి నీటిని తాగడం వల్ల వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడొచ్చు. వేసవిలో ప్రయాణాలు చేసేవాళ్లు కచ్చితంగా వెంట రెండు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాలి.

సమ్మర్‌‌లో ప్రయాణాలు చేసేవాళ్లు వీలైనంత వరకూ వదులైన దుస్తులు ధరించడం మంచిది. తెలుపు లేదా లేత రంగుల బట్టలు అయితే వేడిని తక్కువగా పీల్చుకుంటాయి. నలుపు రంగు దుస్తులను పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అలాగే పిల్లల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు.

సమ్మర్‌లో ప్రయాణాలు చేసేటప్పుడు ఫుడ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయట తినేటప్పుడు నూనె పదార్థాలను అవాయిడ్ చేస్తే మంచిది. వీలైనంత వరకూ పండ్లు, పండ్ల రసాలు, తేలిక పాటి ఆహారాలనే ప్రిఫర్ చేయాలి.

సమ్మర్‌‌లో చెమట పట్టడం ద్వారా శరీరంలో ఉప్పు శాతం తగ్గుతుంది. కాబట్టి వెంట ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ లేదా ఓఆర్‌‌ఎస్ ప్యాకెట్స్ వంటివి తీసుకెళ్తే మంచిది.

సమ్మర్‌‌లో ఫ్యామిలీ టూర్స్‌ వెళ్లేవాళ్లు ముందుజాగ్రత్తగా మెడిసిన్స్, మెడికల్ కిట్ వంటివి తప్పక తీసుకెళ్లాలి. ప్రయాణాల్లో ఎక్కడా వెయిట్ చేసే అవసరం ఏర్పడకుండా ట్రావెల్, స్టే వంటివి ముందుగానే బుక్ చేసుకోవడం బెటర్.

Tags:    
Advertisement

Similar News