బుద్ధవనం శిల్పాలు అదరహో

ఆచార్య గన్ వీర్ ఆధ్వ‌ర్యంలో పూణె డెక్కన్ కాలేజీకి చెందిన 40 మంది విద్యార్థులు, బుద్ధ క్షేత్రాల అధ్యయనంలో భాగంగా శనివారం బుద్ధవనాన్ని సందర్శించారు.

Advertisement
Update:2023-10-14 21:23 IST

తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్‌ తమను ఎంతో ఆకట్టుకుందని పూణె డెక్కన్ కాలేజీకి చెందిన‌ ఎం.ఏ. పురావస్తు శాస్త్రం విద్యార్థులు అన్నారు. ఆచార్య గన్ వీర్ ఆధ్వ‌ర్యంలో 40 మంది విద్యార్థులు, బుద్ధ క్షేత్రాల అధ్యయనంలో భాగంగా శనివారం బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి, మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశాల మేర‌కు బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్ ఎక్స్‌ప‌ర్ట్‌ కన్సల్టెంట్, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్ట‌ర్‌ ఈమని శివనాగిరెడ్డి విద్యార్థులకు బుద్ధవనంలోని ఎంట్రన్స్ ప్లాజా, బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్థూప వనం మహాస్తుపాల గురించి వివరించగా, వారు ఆసక్తికరంగా విని బుద్ధ వనం లాంటి బుద్ధ వారసత్వ తీన్మార్కును మేమెక్కడ చూడలేదన్నారు. బుద్ధుని జీవిత జాతక కథలు, బుద్ధ చిహ్నాలు, వాస్తు విశేషాల‌పై విద్యార్థుల ప్రశ్నలకు శివనాగిరెడ్డి సాదరంగా సమాధానాలు ఇచ్చారు. శిల్ప సౌందర్యం తమను మంత్రముగ్ధుల్ని చేసిందని, నిర్మాణాలు అదరహో అనిపించాయని విద్యార్థులు అన్న‌ట్లు శివ నాగిరెడ్డి చెప్పారు.







Tags:    
Advertisement

Similar News