ఈ ఐలాండ్ దేశాలు మారుతుంది!

ఈ ఐలాండ్ ఏడాదికి రెండు సార్లు బోర్డర్ మారుతుంటుంది. ఇది ఆరు నెలలు ఫ్రాన్స్‌లో, మరో ఆరు నెలలు స్పెయిన్ దేశంలో భాగంగా ఉంటుంది.

Advertisement
Update:2023-03-25 11:37 IST

ప్రపంచంలో ఏ ప్రాంతమైనా ఏదో ఒక దేశానికి చెందినదై ఉంటుంది. అయితే యూరప్‌లోని ఫిసంట్ ఐలాండ్ మాత్రం దీనికి భిన్నం. ఈ ఐలాండ్ ఏడాదికి రెండు సార్లు బోర్డర్ మారుతుంటుంది. ఇది ఆరు నెలలు ఫ్రాన్స్‌లో, మరో ఆరు నెలలు స్పెయిన్ దేశంలో భాగంగా ఉంటుంది.

స్పెయిన్, ఫ్రాన్స్‌ దేశాలకు మధ్యలో ఉన్న బిడసోవా నదిపై ఫిసంట్ ఐలాండ్ ఉంది. వందేండ్ల క్రితం ఫ్రాన్స్‌కు, స్పెయిన్‌కు మధ్య ముప్పై ఏండ్లపాటు యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసిన తర్వాత ఆ రెండు దేశాల మధ్యలో ఉండే ఫీసంట్ ఐలాండ్ కోసం ఇరు దేశాలు రాయబారులను పంపాయి.

ఐలాండ్ మాకంటే మాకు అని గొడవ పడ్డాయి. అలా పదకొండేండ్లు వాదించుకున్నా కూడా డీల్ కుదర్లేదు. దీంతో ఆ ఐలాండ్ ఎటూ కాకుండా మిగిలిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి రెండు దేశాలు మాట్లాడుకొని ఆ ఐలాండ్‌ను చెరొక ఆరు నెలలు పంచుకుందామని డిసైడ్ అయ్యాయి.

రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి గుర్తుగా దాన్ని స్వాపింగ్ ఐలాండ్‌గా మార్చాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకూ ఐలాండ్ స్పెయిన్ కంట్రోల్‌లో ఉంటే మిగతా రోజులు ఫ్రాన్స్ కంట్రోల్‌లో ఉంటుంది. ఐలాండ్ చేతులు మారేటప్పుడు గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. అది చూసేందుకు చాలామంది టూరిస్టులు కూడా వస్తారు. ఐలాండ్‌లో పనిచేసే మున్సిపల్ వర్కర్లు కూడా ఆరు నెలలకోసారి మారుతుంటారు.

Tags:    
Advertisement

Similar News