ఇకపై కార్గిల్ లోయ అందాలు చూడొచ్చు!

ఉత్తర కశ్మీర్‌‌లో ఉన్న గలి–ముష్కో వ్యాలీ.. కశ్మీర్‌‌లోని అందమైన వ్యాలీల్లో ఒకటి. అయితే 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతమంతా ఆర్మీ కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. అక్కడికి ఎవరిని అనుమతించేవాళ్లు కాదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంతం విజిటింగ్‌కు రెడీ అయింది.

Advertisement
Update:2023-09-26 18:55 IST

ఇకపై కార్గిల్ లోయ అందాలు చూడొచ్చు!

ఉత్తర కశ్మీర్‌‌లో ఉన్న గలి–ముష్కో వ్యాలీ.. కశ్మీర్‌‌లోని అందమైన వ్యాలీల్లో ఒకటి. అయితే 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతమంతా ఆర్మీ కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది. అక్కడికి ఎవరిని అనుమతించేవాళ్లు కాదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంతం విజిటింగ్‌కు రెడీ అయింది.

ముష్కో వ్యాలీ.. లఢఖ్‌కు దగ్గర్లో ఉండే అందమైన వ్యాలీ. కార్గిల్ వార్ తర్వాత ఇక్కడికి ఎంట్రీ ఆపేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రోడ్డు తెరిచారు. ఇకపై టూరిస్టులు లఢఖ్‌తో పాటు ముష్కో వ్యాలీ అందాలను కూడా వీక్షించొచ్చు. లఢఖ్‌కు దగ్గర్లో ఉన్న ముష్కో వ్యాలీని గురెజ్ వ్యాలీతో కలిపే 130 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు పర్యాటకుల కోసం తెరచుకుంది. ఈ రోడ్డు ఉత్తర కశ్మీర్‌లోని కార్గిల్‌ రేంజ్ లో ఉన్న గలి ముష్కో వ్యాలీని ప్రస్తుతం లైన్ ఆఫ్ కంట్రోల్‌కు అవతల ఉన్న గురెజ్ వ్యాలీతో కనెక్ట్ చేస్తుంది.

కశ్మీర్‌‌లోని గురెజ్ లోయ పాపులర్ టూరిస్ట్ స్పా్ట్ ఈ ఏడాది ఈ లోయను సుమారు 5000 మంది టూరిస్టులు సందర్శించారు. ఇప్పుడు ఈ లోయను ముష్కో వ్యాలీతో కనెక్ట్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో కూడా పర్యాటక వసతులు, వాణిజ్య సదుపాయాలు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. గురెజ్ లోయ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఉండే కిషన్‌గంగా నది సరిహద్దు రేఖగా పనిచేస్తుంది. ఈ రెండు లోయలను కలిపే రహదారిని ప్రస్తుతం ‘బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్’ నిర్వహిస్తోంది. అయితే ఈ రోడ్డులో కేవలం జీప్ వంటి ఆఫ్ రోడ్ వెహికల్స్ మాత్రమే వెళ్లగలవు.

గురేజ్, ముష్కో లోయలు కశ్మీర్‌లోనే అందమైన వ్యాలీలు. ఇక్కడ కాంక్రీట్ బిల్డింగులు కనిపించవు. చెక్కతో చేసిన ఇళ్లు, పచ్చని మైదానాలు, దూరంగా హిమాలయాలు, అందమైన సరస్సులు, పచ్చిక బయళ్లు మేసే ఐబెక్స్ జింకలు, కస్తూరి జింకలు, అడవి ఉడతల వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాలీ అందమైన తులిప్ తోటలకు ప్రసిద్ధి. కశ్మీర్, లఢఖ్ టూర్ వెళ్లేవాళ్లు తప్పక విజిట్ చేయాల్సిన ప్రాంతమిది.

Tags:    
Advertisement

Similar News