ఇనుప స్తంభమే...పదహారు వందల ఏళ్ల నాటిది
ఇది ఇనుప స్తంభమే, కానీ జస్ట్ ఐరన్ పిల్లర్ మాత్రం కాదు. 'గుప్తుల కాలంలో మనదేశంలో గనులు, ఖనిజ సంపదల గుర్తింపు, లోహశాస్త్రం అత్యున్నత స్థాయికి చేరాయి' అని చరిత్ర పుస్తకంలో చదివిన వాక్యానికి నిదర్శనం.
ఇది ఇనుప స్తంభమే, కానీ జస్ట్ ఐరన్ పిల్లర్ మాత్రం కాదు. 'గుప్తుల కాలంలో మనదేశంలో గనులు, ఖనిజ సంపదల గుర్తింపు, లోహశాస్త్రం అత్యున్నత స్థాయికి చేరాయి' అని చరిత్ర పుస్తకంలో చదివిన వాక్యానికి నిదర్శనం.
ఢిల్లీ, మెహ్రౌలిలో కుతుబ్‌మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ పర్యాటక ప్రాశస్త్యం ఈ ఐరన్ పిల్లర్. ఇది ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటుంది. కానీ తుప్పు పట్టదు. ఇతర లోహాలకంటే ఇనుము వాతావరణ మార్పులకు త్వరగా లోనవుతుంది.
అలాంటిది ఈ పిల్లర్ ఎందుకు తుప్పు పట్టదు... అని పరిశోధనలు చేసిన సైంటిస్టులు నిర్ధారించిన విషయం పై వాక్యం. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగు– ఐదు శతాబ్దాల్లో దీనిని తయారు చేయించాడని కూడా నిర్ధారించారు. ఢిల్లీ వెళ్లినప్పుడు తప్పనిసరిగా చూసి తీరాల్సిన పర్యాటక ప్రదేశం ఇది.
ఇదీ ఆసక్తికరం!
ఈ ఐరన్ పిల్లర్‌కు వీపు ఆనేటట్లు నిలబడి చేతులను వెనక్కి తిప్పి రెండు చేతులను పట్టుకోవాలి. ఇదీ ఇక్కడ టాస్క్. ఆ ప్రయత్నంలో సాధారణంగా రెండు చేతులు ఒకదానికొకటి అందవు. ఒకవేళ చేతులు అందితే వాళ్లు గొప్ప వాళ్లవుతారని ఒక అభిప్రాయం ప్రచారంలో ఉండేది.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు గైడ్‌లు. ఇదంతా పాతికేళ్ల కిందటి కథనం. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి వీల్లేకుండా పిల్లర్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దగ్గర నిలబడి పిల్లర్ ను చూడడమే ఇప్పుడు చేయగలిగింది. పిల్లర్ మీద అక్షరాలుంటాయి. ఏ భాషలో ఉన్నాయనేది కూడా అర్థం కాదు. అది అప్పటి శాసనం.
ఉలి నైపుణ్యం
ఈ ప్రాంగణంలో పెద్ద వరండా అంతా కలియతిరిగి తీరాలి. ఒక్కో రాతి స్తంభం ఒక్కో కళామకుటం. దక్షిణాదిలో గొప్ప శిల్పనైపుణ్యాన్ని చాలా చోట్ల చూడవచ్చు. కానీ ఉత్తరాదిలో ఇంతటి ఉలి నైపుణ్యాలు తక్కువే.
పాలరాతి జైన మందిరాలు, స్వామి నారాయణ మందిరాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. అలాంటిది ఇక్కడ రాతిలో చక్కటి శిల్పాలు అవి కూడా ఒక çథీమ్‌కి అనుగుణంగా చెక్కినట్లు అనిపిస్తుంది. చాలా కట్టడాలు విధ్వంసానికి లోనయి గోడలు మాత్రమే ఉన్నాయి. కానీ... ఇండో–పర్షియన్ నిర్మాణశైలిల మేళవింపుగా ఆవరణ టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉంది.