ఐఆర్‌సీటీసీ అల్టిమేట్ ఊటీ ట్రిప్! ప్యాకేజీ వివరాలివీ..
ఐఆర్‌సీటీసీ అల్టిమేట్ ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు క్లాస్, షేరింగ్‌ను బట్టి రూ.11,630 నుంచి రూ.31,910 వరకూ అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ట్రైన్ టికెట్స్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.
వింటర్‌లో ఊటీ అందాలు చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ.. ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ పేరుతో ప్రత్యేకమైన టూర్ ఆపరేట్ చేస్తుంది. ఐదు రాత్రులు ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్ ఎలా ఉంటుందంటే..
తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ తక్కువ ధరకు టూర్‌ను ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్ల నుంచి ప్రయాణీకులు రైలు ఎక్కొచ్చు. ఈ టూర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్ డిసెంబర్ 12న ఉంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ టూర్ ప్యాకేజీలో ఊటీతోపాటు కూనూర్ కూడా విజిట్ చేయొచ్చు.
టూర్ ఎలా సాగుతుందంటే..
మొదటి రోజు సికింద్రాబాద్‌లో ‘శబరి ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కడంతో ఐఆర్‌సీటీసీ ‘అల్టిమేట్ ఊటీ’ టూర్ ప్రారంభం అవుతుంది. ఓవర్ నైట్ జర్నీ చేసిన తర్వాత రెండో రోజు ఉదయానికి ప్రయాణీకులు కోయంబత్తూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి వెహికల్ ద్వారా ఊటీకి బయల్దేరతారు. మధ్యాహ్నానికి ఊటీ వెళ్లి హోటల్‌లో చెక్‌ఇన్ అవుతారు. సాయంత్రం ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ వంటివి విజిట్ చేస్తారు. రాత్రికి ఊటీలో స్టే ఉంటుంది.
మూడోరోజు ఊటీలోని దొడబెట్ట హిల్, టీ మ్యూజియం, పైకారా వాటర్ ఫాల్స్ వంటివి చూసుకుని రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. నాలుగోరోజు ఊటీకి దగ్గర్లోని కూనూర్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. నాలుగోరోజు సాయంత్రం మళ్లీ ఊటీలోని హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఐదోరోజు పొద్దున్నే టిఫిన్ చేసి కోయంబత్తూర్ బయల్దేరతారు. కోయంబత్తూర్‌లో మధ్యాహ్నం రిటర్న్ ట్రైన్ ఎక్కి ఆరో రోజు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్‌సీటీసీ అల్టిమేట్ ఊటీ టూర్ ప్యాకేజీ ధరలు క్లాస్, షేరింగ్‌ను బట్టి రూ.11,630 నుంచి రూ.31,910 వరకూ అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలో భాగంగా ట్రైన్ టికెట్స్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. బుకింగ్స్ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (irctctourism.com)ను విజిట్ చేయొచ్చు.
♦