ఐఆర్‌‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..

ఒకే టూర్‌‌లో ఏడు జ్యోతిర్లింగాలను కవర్ చేసేలా ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్’ యాత్ర టూర్‌‌ను ఆపరేట్ చేస్తుంది ఐఆర్‌‌సీటీసీ.

Advertisement
Update:2023-11-16 18:00 IST

ఐఆర్‌‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ యాత్ర.. ప్యాకేజీ వివరాలివే..

కార్తీక మాసంలో జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలి అనుకునేవాళ్లకోసం ఐఆర్‌‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ఒకే ట్రిప్‌లో ఏడు జ్యోతిర్లింగాలు చూసి వచ్చే విధంగా ట్రిప్ ప్యాకేజీ రూపొందించింది. వివరాల్లోకి వెళ్తే..

ఒకే టూర్‌‌లో ఏడు జ్యోతిర్లింగాలను కవర్ చేసేలా ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్’ యాత్ర టూర్‌‌ను ఆపరేట్ చేస్తుంది ఐఆర్‌‌సీటీసీ. పన్నెండు రాత్రులు పదమూడు పగళ్లపాటు సాగే ఈ టూర్ నవంబరు 18న మొదలవుతుంది. ఈ ట్రైన్ రెండు విజయవాడ నుంచి మొదలవుతుంది. ప్రయాణికులు విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు, దిగొచ్చు.

ప్రయాణం ఇలా..

మొదటిరోజు నవంబర్‌ 18న విజయవాడలో రాత్రి 8 గంటలకు రైలు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 2: 42 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. రెండు రోజుల ప్రయాణం తర్వాత మూడో రోజు ఉదయానికి ఉజ్జయిని చేరుకుంటారు. ఆ రోజు ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక నాలుగో రోజు పొద్దున్నే రోడ్డు మార్గం ద్వారా ఓంకారేశ్వర ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ఆలయాన్ని దర్శించుకుని మళ్లీ సాయంత్రానికి ఉజ్జయిని రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి రైలులో వడోదరకు బయల్దేరతారు. ఐదోరోజు ఉదయం వడోదర చేరుకుని హోటల్‌లో చెకిన్ అవుతారు. తర్వాత స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ చూసుకుని ద్వారకకు బయల్దేరతారు. ఆరో రోజు ద్వారకలో ద్వారకాదీశ్‌ ఆలయాన్ని దర్శించుకుని రాత్రికి అక్కడే స్టే చేస్తారు.

ఇక ఏడో రోజు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి బెట్‌ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. సాయంత్రానికి ద్వారక రిటర్న్ అయ్యి అక్కడ్నుంచి సోమనాథ్‌కు బయల్దేరతారు. ఎనిమిదో రోజు సోమనాథ్‌ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని సాయంత్రం నాసిక్ కు బయల్దేరతారు. తొమ్మిదో రోజు నాసిక్‌ చేరుకుని అక్కడే నైట్ స్టే చేస్తారు. ఇక పదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి నాసిక్‌లోని త్రయంబకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం నాసిక్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణెకు బయల్దేరతారు. పదకొండవ రోజు ఉదయం టిఫిన్‌ చేసి పుణెకి దగ్గర్లోని భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఔరంగాబాద్‌ బయల్దేరతారు. పన్నెండవ రోజు ఔరంగాబాద్‌లోని ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని రాత్రికి సికింద్రాబాద్‌ రిటర్న్ అవ్వడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజ్ వివరాలు

ప్యాకేజీలో భాగంగా రైలు జర్నీ, వెహికల్ ఎరేంజ్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, నైట్ స్టే, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ వంటివి కవర్ అవుతాయి. టికెట్‌ ధరలు.. స్లీపర్‌ క్లాస్‌లో ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.21,000, థర్డ్‌ ఏసీలో ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.32,500, సెకండ్ ఏసీలో ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.42,500గా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News