ఐఆర్‌సీటీసీ సర్కులర్ జర్నీ టికెట్.. ఒకే టికెట్‌తో దేశమంతా తిరగొచ్చు!
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైలు మార్గాన్ని మించిన ఆప్షన్ లేదు. అందుకే చాలామంది ఎక్కడికెళ్లాలన్నా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైలు మార్గాన్ని మించిన ఆప్షన్ లేదు. అందుకే చాలామంది ఎక్కడికెళ్లాలన్నా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే రకరకాల అవసరాల కోసం రోజూ వందల కిలోమీటర్లు ప్రయాణించే వాళ్ల కోసం ఐఆర్‌సీటీసీ.. ‘సర్కులర్ జర్నీ టికెట్’ అనే కొత్త సర్వీసుని తీసుకొచ్చింది. దీంతో ఒకే టికెట్‌తో 56 రోజుల పాటు వందల మైళ్లు ప్రయాణించే వీలుంటుంది.
ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న ‘సర్క్యులర్ జర్నీ టికెట్’ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. రెగ్యులర్ ట్రైన్ టికెట్‌తో పోలిస్తే.. సర్క్యులర్ జర్నీ టికెట్ల ధరలు కూడా తక్కువే. అంతేకాదు, వీటిలో ప్రయాణానికి అనుకూలంగా నచ్చిన క్లాసును ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఒకచోట ప్రయాణాన్ని మొదలుపెట్టి.. గరిష్టంగా 56 రోజుల పాటు ప్రయాణించి మళ్లీ తిరిగి స్టార్టింగ్ పాయింట్‌కు చేరుకునే వరకు ఈ సర్కులర్ టికెట్ వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం ప్రయాణంలో ఎనిమిది జర్నీ బ్రేక్‌లు తీసుకోవచ్చు. అంటే మధ్యలో ఎంపిక చేసుకున్న ఎనిమిది స్టేషన్లలో దిగి, కొద్దిరోజులు ఆ ప్రదేశాన్ని సందర్శించి మళ్లీ తిరిగి జర్నీ కంటిన్యూ చేయొచ్చు. ఇలా 56 రోజులపాటు ఒకే టికెట్‌తో ప్రయాణం చేసే వీలుంటుంది. ఉద్యోగ, వ్యాపార పనుల మీద అనేక ప్రాంతాలు తిరిగేవాళ్లకు అలాగే ఒకేసారి ఎక్కువ విహార యాత్రలు, తీర్ధయాత్రలు చేయాలనుకునేవాళ్లకు ఈ టికెట్ బెస్ట్ ఆప్షన్.
బుకింగ్ ఇలా..
సర్క్యులర్ జర్నీ టికెట్ల కోసం దగ్గర్లోని రైల్వే డివిజనల్ మేనేజర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. జర్నీ ప్లాన్, జర్నీ బ్రేక్స్‌ను బట్టి వాళ్లు టికెట్ ధరను నిర్ణయిస్తారు. ప్రయాణాన్ని మొదలుపెట్టే స్టేషన్‌లో ఈ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉంటుంది. అయితే విడివిడిగా బుక్ చేసుకుంటే అయ్యే టికెట్ల ధర కంటే సర్క్యులర్ జర్నీ టికెట్ చౌకగానే ఉంటుంది. పైగా పదేపదే టికెట్లు బుక్ చేసుకునే పని కూడా తప్పుతుంది.
♦