ఇండియన్ పాస్‌పోర్టుతో ఈ దేశాలన్నీ తిరిగేయొచ్చు!
ఇండియన్ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే సుమారు 57 దేశాలకు వెళ్లే వీలుంది.
ఒకప్పుడు ఏ దేశానికి వెళ్లాలన్నా.. వీసా కచ్చితంగా ఉండాల్సి వచ్చేది. అయితే రోజులు మారుతున్న కొద్దీ ఇండియన్ పాస్ పోర్టుకు విలువ పెరుగుతోంది. ప్రస్తుతం పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకుల్లో ఇండియా 80వ స్థానంలో ఉంది. మన పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే సుమారు 57 దేశాలకు వెళ్లే వీలుంది.
ఇండియన్ పాస్‌పోర్ట్ తో భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ , బురుండి, బార్బడోస్ కాంబోడియా, కుకు ఐలాండ్స్, మడగాస్కర్, మాల్దీవులు, కేప్ వెర్డే ఐలాండ్స్, శ్రీలంక, ఖతర్, కొమొరో ఐలాండ్స్, జిబౌటి, థాయ్‌లాండ్, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, నేపాల్, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, టాంజానియా, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మార్షల్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, మౌరిటానియా, మారిషస్, జింబాబ్వే, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, రువాండా, మయన్మార్, నియు, ఒమన్, పలావ్ ఐలాండ్స్, తువాలు, వనటు, సమోవా, సెనెగల్, సెషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, తైమూర్–లెస్టే, టోగో, ట్యునీషియా వంటి దేశాలకు ప్రయాణమవ్వొచ్చు. ఈ దేశాలన్నింటినీ ఆయా దేశాల వీసాలతో పనిలేకుండా ఇండియన్ పాస్‌పోర్ట్‌తోనే సందర్శించే వీలుంది.
ఇక మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల విషయానికొస్తే.. సింగపూర్ టాప్‌లో ఉంది. సింగపూర్ పాస్‌పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, సౌత్ కొరియా, స్వీడన్ వంటి దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పాకిస్థాన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పాపా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలు జీరో ర్యాంక్‌లో ఉన్నాయి. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా ఏ దేశంలోకి ప్రవేశించలేరు.