సింపుల్ టిప్స్‌తో కారునే కారవాన్ చేయండిలా..

కారవాన్‌ను రెడీ చేసుకోవడం చాలా ఈజీ. కారు లేదా ఎస్‌యూవీని కారవాన్‌గా మార్చుకోవచ్చు.

Advertisement
Update:2023-11-25 18:00 IST

ప్రయాణించడం, నివసించడం.. ఈ రెండు వేర్వేరు విషయాలు. కానీ, కారవాన్ ఉంటే ఈ రెండూ ఒకటవుతాయి. కారవాన్ అంటే కదిలే ఇల్లు లాంటిది. అందులోనే ఉంటూ నచ్చిన చోటుకు వెళ్లొచ్చు. కారులో ఉంటూనే పని కూడా చేసుకోవచ్చు. మరి కారవాన్ ట్రిప్స్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి?

కారవాన్ ట్రావెలింగ్ అనే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నా మనదేశంలో అలాంటి టూర్స్ చేసేవాళ్లు చాలా తక్కువ. కారవాన్ అంటే అన్ని వసతులతో కూడిన వాహనం. సోలోగా లేదా గ్రూప్‌తో కలిసి ఇండిపెండెంట్‌గా ట్రావెల్ చేయాలనుకునేవాళ్లు ఇలాంటి టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ టూర్స్‌కు కూడా ఇది సూట్ అవుతుంది.

నచ్చినచోటే విడిది

కారవాన్ ట్రావెల్ అనేది విదేశాల్లో చాలా పాపులర్ ట్రావెలింగ్ స్టైల్. ఇలాంటి ట్రావెల్ చేయాలంటే.. ఎక్కువగా రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లోనే టైం స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కారవాన్ టూర్ ఎంత ప్రిపేర్డ్‌గా ఉంటే అంత బాగుంటుంది. చాలామంది విదేశీ టూరిస్టులు కారవాన్‌లో దేశాలు దాటి ట్రావెల్ చేస్తుంటారు. ఒక్కసారి కారవాన్‌లో బయలుదేరితే మళ్లీ కొన్ని నెలలకు తిరిగి ఇంటికి వస్తారు. నచ్చిన ప్లేస్‌లో కారవాన్‌ను పార్క్ చేయడం, ఆ ప్రదేశంలో విడిది చేయడం, ఎంచుకున్న మ్యాప్ ప్రకారం ప్రదేశాలన్నీ కవర్ చేస్తూ ముందుకెళ్లడం.. ఇదే కారవాన్ టూర్ అంటే.


ప్రిపరేషన్ ఇలా..

కారవాన్‌ను రెడీ చేసుకోవడం చాలా ఈజీ. కారు లేదా ఎస్‌యూవీని కారవాన్‌గా మార్చుకోవచ్చు. వ్యాన్ లాంటిదైతే ఇంకా బాగుంటుంది. ముందుగా కారులో డ్రైవర్ సీట్ తప్ప మిగతా సీట్లన్నీ తొలగించాలి. అప్పుడు కారులోపల అంతా ఖాళీ అవుతుంది. కారు ఎత్తుని బట్టి రెండు మూడు అడుగుల ఎత్తులో బల్లాలు లేదా ఐరన్ గ్రిల్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. వాటిపైన బెడ్స్ అమర్చితే కారవాన్ రెడీ. గ్రిల్స్ కింద స్పేస్‌ను లగేజీ కోసం వాడుకోవచ్చు. పైన బెడ్స్ వంటివి అమర్చుకోవచ్చు. ఒకవేళ పెద్ద వ్యాన్ అందుబాటులో ఉంటే అందులోనే చిన్న కిచెన్, టాయిలెట్ వంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న కారు అయితే పోర్టబుల్ స్టవ్, కన్వర్టెడ్ టాయిలెట్స్ వంటివి తీసుకెళ్లాలి.

కారవాన్ రెడీ అయ్యాక దానికి ఎక్స్‌ట్రా బ్యాటరీలతో పవర్ సప్లై ఏర్పాటుచేసుకోవాలి. ఛార్జింగ్, వైఫై మోడెమ్స్, లైట్స్ వంటివి సెట్ చేసుకోవాలి. ఫుడ్, టెంట్, వాటర్ ఇతర సామాన్లన్నీ బెడ్స్ కింద సెట్ చేసుకోవాలి. కారుకి పైన లగేజీ క్యారియర్ ఉంటే అదనపు లగేజీని అక్కడ పెట్టుకోవచ్చు.

ప్లానింగ్ ఇలా..

తయారుచేసుకున్న మోటర్ హోమ్‌లో ఎంతమంది సౌకర్యంగా వెళ్లగలరో నిర్ణయించుకుని దానికి తగ్గట్టు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న మ్యాప్స్‌లోని ప్రాంతాలను కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏదైనా సిటీ లేదా విలేజ్‌కి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలా నెలల పాటు కారవాన్‌లోనే ప్రయాణించొచ్చు. హోటల్స్, ట్రాన్స్‌పోర్ట్‌తో పనిలేదు. ఫుడ్ కూడా మీరే వండుకోవచ్చు. అయితే కారవాన్స్ టూర్స్ చేసేవాళ్లు కనెక్టివిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడాలి.

Tags:    
Advertisement

Similar News